కోటి ఆశలతో..
అమలాపురంగడియార స్తంభం సెంటర్
సాక్షి, అమలాపురం: నూతన సంవత్సరం అనగానే కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో గడవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వ్యవసాయం బాగుండాలని రైతు, ఉద్యోగ అవకాశాలు పెరగాలని నిరుద్యోగి, మెరుగైన జీతభత్యాలు రావాలని ఉద్యోగి, తమకు వ్యక్తిగత భద్రత, ఆర్థిక భరోసా కావాలని మహిళలు, ఉన్నత చదువులకు చేయూత దక్కాలని విద్యార్థి.. ఇలా సమాజంలో అన్ని రంగాల వారూ ఆశలు పెట్టకుంటారు. గడిచిపోయిన సంవత్సరంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మరచి, రాబోయే కొత్త సంవత్సరంలో తమ జీవితాలు మెరుగుపడాలని ఆకాంక్షిస్తారు. మరి కొద్ది గంటలలో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజలు తమ జీవితాలు నవీన పథంలో పయణించాలని కోరుకుంటున్నారు. అవకాశాలు వస్తే అందిపుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ప్రభుత్వం నాటి సంక్షేమ ఫలాలు అందాలని బడుగు, బలహీన, మధ్య తరగతి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పేద, మధ్య తరగతి, రైతు వ్యతిరేక విధానాలతో సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు. తమ ఆశలు.. ఆకాంక్షలను ‘సాక్షి’కి వివరించారు.
కొత్త ఏడాదిలో అందరూ బాగుండాలి
అన్ని రంగాలూ వృద్ధి చెందాలి
చంద్రబాబు ప్రభుత్వానికి
జ్ఞానోదయం కలగాలి
సంక్షేమ ఫలాలు అందాలి
జిల్లా ప్రజల ఆకాంక్ష
కోటి ఆశలతో..


