పి.గన్నవరం: వాడ్రేవుపల్లి శివారు చాకలిపాలెం వద్ద శనివారం రాత్రి ఆటో తిరగబడిన ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై హరికోటిశాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం.. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలేనికి చెందిన కందాల వెంకటరావు (77) పెదకందాలపాలెం గ్రామానికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు పెదకందాలపాలెం వద్ద పి.గన్నవరం నుంచి రాజోలు వెళ్తున్న ఆటో ఎక్కాడు. అయితే చాకలిపాలెం వద్ద ఆటోకు మోటారు సైకిల్ అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేకు వేశాడు. దీంతో ఆటో రోడ్డుపై తిరగబడటంతో వృద్ధుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. అప్పటికే అతడు మృతి చెందాడు. ఆటోలోని మరో ఇద్దరు ప్రయాణికులతో పాటు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment