
కుండపోత.. ఉక్కపోత..
సాక్షి, అమలాపురం: వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు వాన పడుతుందో తెలియడం లేదు. వేసవిని తలదన్నెలా ఎండ కాస్తూ ప్రజలను భయపెడుతోంది. అంతలోనే చల్లని చినుకులు సేదతీర్చుతున్నాయి. అమలాపురంలో మంగళవారం గంట పాటు ఏకదాటిగా వర్షం పడింది. ఏకంగా 18.2 మీమీ కురిసింది. ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కురిసిన వర్షంతో సామన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భానుడు విజృంభించాడు. విపరీతమైన ఎండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

కుండపోత.. ఉక్కపోత..