అప్పు ఇవ్వొద్దు,పాక్‌పై భారత్‌ ఫైనాన్షియల్‌ స్ట్రైక్‌.. | Nirmala Sitharaman demands ADB to cut Pakistan funding | Sakshi
Sakshi News home page

అప్పు ఇవ్వొద్దు,పాక్‌పై భారత్‌ ఫైనాన్షియల్‌ స్ట్రైక్‌..

May 5 2025 4:22 PM | Updated on May 5 2025 5:58 PM

 Nirmala Sitharaman demands ADB to cut Pakistan funding

ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్‌ ఫైనాన్షియల్‌ స్ట్రైక్‌ చేస్తోంది భారత్‌. ఇప్పటికే ఐఎంఎఫ్‌ తలుపు తట్టిన ప్రధాని మోదీ సర్కార్‌ తాజాగా, ఇటలీలో ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (adb)ను సంప్రదించింది. 

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు రుణాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఏడీబీ వార్షిక సమావేశం కోసం ఇటలీకి వెళ్లిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంక్‌ చీఫ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాకిస్తాన్‌కు ఇస్తున్న ఏడీబీ రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదేశానికి అప్పిస్తే.. ఆ సొమ్ము మొత్తం ఉగ్ర సంస్థల ఖాతాల్లోకి వెళుతోందని వివరించారు.  

ఏడీబీ చీఫ్‌తో పాటు, ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్‌కార్లో గియోర్గెట్టితో కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. పాకిస్తాన్‌కు ఇచ్చే నిధుల విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

 

కాగా, మే 4 నుండి 7 వరకు జరగనున్న ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) గవర్నర్ల బోర్డు 58వ వార్షిక సమావేశంలో సీతారామన్ ఇటాలి మిలాన్‌లో పర్యటిస్తున్నారు. గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశానికి నిర్మలా సీతారామన్‌ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement