డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు తప్పించుకోబోయి.. చుట్టుపక్కల గమనించకపోడంతో.. | Youth Died Railway Track Over Escape From Drunk And Drive Case Karnataka | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు తప్పించుకోబోయి.. చుట్టుపక్కల గమనించకపోడంతో..

Apr 9 2022 3:52 PM | Updated on Apr 9 2022 3:57 PM

Youth Died Railway Track Over Escape From Drunk And Drive Case Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు కింద పట్టుబడతాననే భయంతో పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఒక యువకుడు రైలుకింద పడి మృతి చెందిన సంఘటన రామనగర తాలూకా బసవనపుర గ్రామం వద్ద చోటుచేసుకుంది. బెంగళూరు సుంకదకట్టె నివాసి దిలీప్‌ (28) మృతి చెందిన వ్యక్తి. గురువారం రాత్రి దిలీప్, మరో ఆరుగురు యువకులు కారులో బెంగళూరు నుంచి మైసూరుకు మద్యం తాగుతూ బయలుదేరారు.

బవనపుర వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా మద్యం తాగుతున్నందుకు అరెస్టు చేస్తారనే భయంతో కారు దిగిన దిలీప్‌ రోడ్డు పక్కన రైలు పట్టాలపైకి పరుగెత్తాడు. అదే సమయంలో రైలు రావడంతో రైలు కింద పడి మృతి చెందాడు. పోలీసులు ఐదుగురు యువకులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారయ్యాడు. రామనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

చదవండి: భర్తతో దూరం.. వీఆర్వోతో మహిళకు పరిచయం.. ‘నేను మోసపోయానమ్మా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement