Young Woman Missing In Ranga Reddy District - Sakshi
Sakshi News home page

Ranga Reddy Crime: యువకుడితో చాటింగ్‌.. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి వచ్చేసరికి

Aug 6 2022 1:48 PM | Updated on Aug 6 2022 3:45 PM

Young Woman Missing In Ranga Reddy District - Sakshi

రంగారెడ్డి: యువతి అదృశ్యమైన ఘటన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం..   మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన పల్లె మహేశ్వరి(20) శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇంట్లో ఉంది. కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చే వరకు యువతి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల తెలిసిన వారి వద్ద వాకబు చేసిన అచూకీ లభించలేదు. దీంతో చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యువతి ఇటీవల సందీప్‌ అనే యువకుడితో చాటింగ్‌ చేస్తుండడంతో కుటుంబసభ్యులు మందలించినట్లు తెలిపారు. దీంతో యువతి సోదరుడు సందీప్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement