పెళ్లైన మహిళతో యువకుడి సహజీవనం.. చివరికి.. | Young Man Commits Suicide By Falling Under Train In Anantapur District | Sakshi
Sakshi News home page

పెళ్లైన మహిళతో యువకుడి సహజీవనం.. చివరికి..

Apr 1 2022 7:59 PM | Updated on Apr 1 2022 7:59 PM

Young Man Commits Suicide By Falling Under Train In Anantapur District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ సమీపంలోని షీఫారం వద్ద గురువారం చోటుచేసుకుంది.

పెనుకొండ(అనంతపురం జిల్లా): రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ సమీపంలోని షీఫారం వద్ద గురువారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ బాలాజి తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం పావగడ సమీపంలోని రొప్పంకు చెందిన కురుబ రాఘవేంద్ర (26) ఏటిగడ్డ తిమ్మాపురానికి చెందిన ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళను పెళ్లి చేసుకుంటానని కొన్ని రోజుల క్రితం ఇంట్లో పెద్దలకు చెప్పగా, వారు ఒప్పుకోలేదు.

చదవండి: ట్రావెల్‌​ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్‌ సీన్‌..

దీంతో అప్పటి నుంచి మనోవేదనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే బైకులో బుధవారం రాత్రి షీఫారం వద్దకు వచ్చిన యువకుడు జీవితంపై విరక్తితో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద దొరికిన ఆధార్‌కార్డు ఆధారంగా పోలీసులు బంధువులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement