ప్రేమకు పెద్దల అడ్డు.. పార్కుకు వచ్చి ఆత్మహత్య

Young Lovers Lost Life After Parents Not Agreed Their Love Chennai - Sakshi

తిరువొత్తియూరు: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువణ్ణామలై జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వందవాసి కొత్త బస్టాండ్‌ వద్దనున్న పార్కులో వాకింగ్‌ వెళ్లిన కొందరు యువతీ యువకుడి మృతదేహాలను గుర్తించారు.  పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. సమీపంలో విషం బాటిల్‌ ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావించారు. యువకుడి సెల్‌ఫోన్‌ నుంచి చివరిగా వెళ్లిన నంబర్‌కు కాల్‌ చేసి మాట్లాడారు. అతనిచ్చిన సమాచారం మేరకు చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకా కాట్టు కూడలూరు గ్రామానికి చెందిన శంకర్‌ కుమారుడు భరత్‌.. రామాపురం గ్రామానికి చెందిన షణ్ముగం కుమార్తె అక్షయ (19)ని గుర్తించారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో పార్కుకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top