ఘోర రోడ్డు ప్రమాదం.. సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి | Woman Died In Road Accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Mar 19 2024 8:40 AM | Updated on Mar 19 2024 11:19 AM

Woman Died In Road Accident - Sakshi

 డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు...

పెనుకొండ రూరల్‌: డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగుకు చెందిన మురళి, ఉమాదేవి (34) దంపతులు బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. బెంగళూరులోనే స్థిరపడిన వీరు... తమ ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు.

ఆదివారం రాత్రి కారులో బెంగళూరుకు బయలుదేరారు, సోమవారం ఉదయం పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుట్టూరు వై.జంక్షన్‌ వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొని రెండు ముక్కలైంది. ఘటనలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలుతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెనుకొండ ఎస్‌ఐ రంగడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement