breaking news
techie dead
-
కాన్సాస్‌లో ఆకస్మిక వరదలు : ఏపీకి చెందిన టెకీ దుర్మరణం
అమెరికాలో కాన్సాస్‌లో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల్లో (Flash Floods) చిక్కుకుని వెంకటేష్ దొప్పలపూడి (33) అనే భారతీయ ఐటీ నిపుణుడు, ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని పర్చూరు మండలానికి చెందినవ్యక్తిగా గుర్తించారు. శనివారం మధ్యాహ్నం ఆయన హ్యూస్టన్ నుండి ఉత్తర దిశగా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. వెంకటేష్ నెబ్రాస్కాలో నివసిస్తూ, H-1B వీసాపై అక్కడ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సౌత్-సెంట్రల్ కాన్సాస్‌లో కురిసిన భారీ వర్షాల (6 ఇంచుల కంటే ఎక్కువ వర్షపాతం) కారణంగా అకస్మాత్తుగా వరదలు పోటెత్తాయి. వెల్లింగ్టన్లోని 'సౌత్ ఆలివర్ రోడ్' బ్రిడ్జ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో మునిగిపోయింది. కారులో ఒకరు చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం అందించడంతో సమ్నర్ కౌంటీ ఎమర్జెన్సీ రెస్పాండర్స్ రంగంలోకి దిగారు. అయిత వరద ఉధృతి, బలమైన ప్రవాహాల కారణంగా ప్రారంభంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్లు, ఎయిర్ యూనిట్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. కాన్సాస్ హైవే పెట్రోల్ ఎయిర్ యూనిట్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన గాలింపు అనంతరం ఆదివారం వెంకటేష్ మృతదేహాన్ని వెలికితీశారు.ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై ఎక్స్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించింది. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, మృతదేహాన్ని భారతదేశానికి (స్వగ్రామానికి) తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కన్సులేట్ పేర్కొంది. ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు -
ఘోర రోడ్డు ప్రమాదం.. సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
పెనుకొండ రూరల్: డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన మురళి, ఉమాదేవి (34) దంపతులు బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. బెంగళూరులోనే స్థిరపడిన వీరు... తమ ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఆదివారం రాత్రి కారులో బెంగళూరుకు బయలుదేరారు, సోమవారం ఉదయం పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుట్టూరు వై.జంక్షన్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొని రెండు ముక్కలైంది. ఘటనలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలుతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెనుకొండ ఎస్ఐ రంగడు తెలిపారు. -
భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా నివేదిక
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన భానురేఖ(23).. బెంగళూరు అండర్‌పాస్ వరదలో చిక్కుకుని మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. రాజకీయంగానూ విమర్శలకు దారి తీసిన ఈ ఘటనపై.. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించగా, ఇంటర్నల్ రిపోర్టులో విస్తుపోయేలా విషయాలను చేర్చింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. భానురేఖ మృతికి.. ఆమె స్వీయతప్పిదమే కారణమంటూ నివేదికను సిద్ధం చేసింది బీబీఎంపీ(బృహత్ బెంగళూరు మహానరగ పాలిక)!.‘‘ ఆ సమయంలో కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ కింద నీరు చేరింది. డ్రైవర్ అక్కడే ఉన్న బారికేడ్లను పట్టించుకోకుండా ముందుకు పోనిచ్చారు. ఆ సమయంలో కొందరు అక్కడే ఉండి కేకలు వేస్తూ వద్దని వారించారు. డ్రైవర్‌ను అడ్డుకునే అవకాశం ఉన్నా.. భానురేఖ ఆ పని చేయలేదు’’ అని బీబీఎంపీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భానురేఖ మృతికి తమ పౌర సేవల విభాగం ఏమాత్రం కారణం కాదని, ఇందులో తమ తరుపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదని బీబీఎంపీ పేర్కొంది. అలాగే.. ఘటన నాడు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి ఎండుటాకులు, చెట్ల కొమ్మలు నేలరాలాయని, వర్షంతో కలిసి అవి కేఆర్ అండర్‌పాస్ వద్ద నీరు నిలిచిపోవడానికి కారణం అయ్యాయని తెలిపింది. అండర్‌పాస్‌ల కింద వాననీరు నిలిచిపోకుండా ఉండేందుకు అక్కడ డ్రైనేజీలను నిర్మించాల్సిన అవసరం ఉందని నివేదికలో అభిప్రాయపడింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. అయితే కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ.. దాని కెపాసిటీకి మించి నీరు రావడం, ఆకులు.. కొమ్మలు అడ్డుపడడంతో నీరు నిలిచిపోయిందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ నివేదికకు సంబంధించిన కాపీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనకు ముమ్మాటికీ నగరపాలక సంస్థనే కారణమంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై భానురేఖ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీబీఎంపీ తోపాటు డ్రైవర్ హరీష్ గౌడ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని హలసూరు గేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది భానురేఖ కుటుంబం. సాక్షి, కృష్ణా: బెంగళూరులో ఊహించని రీతిలో ప్రాణం పొగొట్టుకున్న భానురేఖకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మృతదేహం డీకంపోజ్ కాకుండా భద్రపరిచి.. స్వస్థలం తేలప్రోలుకు తరలించగా.. ఇవాళ(మంగళవారం) ఉదయం అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు భానురేఖ మృతదేహానికి ఏపీ పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు, పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలోని హిమాయత్‌సాగర్ సమీపంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. నజియా సుల్తానా అనే ఇన్ఫోసిస్ ఉద్యోగిని కారులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా మార్గమధ్యలోనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దాంతో నజియా సుల్తానా అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు కాగా కారు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.


