భర్త వేధింపులు తాళలేక.. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య | Woman committed Commit Suicide in hyderabad | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక.. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

Apr 10 2024 7:05 AM | Updated on Apr 10 2024 7:06 AM

Woman committed Commit Suicide in hyderabad - Sakshi

పోచారం: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పోచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.  సీఐ రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా, మాదారం గ్రామానికి చెందిన భారతి (30) నగరానికి వలసవచ్చి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. చింతా లక్ష్మణ్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుంది. లక్ష్మణ్‌ కొర్రెముల గ్రామం వద్ద చికెన్‌ షాపు నిర్వహించేవాడు. గత కొన్నాళ్లు మద్యానికి బానిసైన లక్ష్మణ్‌  షాప్‌ తెరవడం లేదు. ఈ నెల 8న ఉదయం భారతి భర్తను పద్ధతి మార్చుకోవాలని చెప్పడంతో అతను ఆమెపై దాడి చేశాడు. 

కాగా అదే రోజు సాయంత్రం లక్ష్మణ్‌ భారతి సోదరుడు 
మహేష్‌ కు వీడియో కాల్‌చేసి భారతి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుందని చెప్పాడు. ఆమెను కాపాడాలని వేడుకున్నా పట్టించుకోకుండా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో మహేష్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. భర్త వేధింపుల కారణంగా తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement