నడి రోడ్డుపై అడ్డగించి మరీ...మహిళపై ఓ వ్యాపారి యాసిడ్‌ దాడి..

Woman In Assam Injured In Acid Attack - Sakshi

ఓ వ్యాపారి మహిళపై యాసిడ్‌  దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ మహిళ రాకను గమనించి రోడ్డుపై కాపుకాసి మరీ దాడి చేశాడు నిందితుడు. ఈ ఘటన అస్సాంలోని ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...నిందుతుడికి సదరు మహిళకి ఒకరికొకరు సుపరిచితులే. నిందితుడు వివాహితుడు కాగా ఆమె అవివాహితురాలు. ఇరువురు కొద్దిరోజులు సహజీవనం చేశారు.

ఐతే గత కొద్దిరోజులుగా ఇరువురి మధ్య డబ్బుల విషయమై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే నిందితుడు ఆ 30 ఏళ్ల మహిళపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితుడు వ్యాపారి వాస్తుకర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్‌ బిశ్వ శర్మ తెలిపారు.

(చదవండి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top