Vizianagaram: ట్రైనింగ్‌కు వచ్చిన మహిళా ఎస్సై ఆత్మహత్య | Woman ASI Commits Suicide In Vizianagaram District | Sakshi
Sakshi News home page

Vizianagaram: ట్రైనింగ్‌కు వచ్చిన మహిళా ఎస్సై ఆత్మహత్య

Aug 29 2021 12:52 PM | Updated on Aug 29 2021 1:29 PM

Woman ASI Commits Suicide In Vizianagaram District - Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లా పీటీసీ ట్రైనింగ్‌ సెంటర్‌లో విషాదం చోటుచేసుకుంది. ట్రైనింగ్‌కు నిమిత్తం వచ్చిన ఒక మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.. భవానీ అనే ఎస్సై రాత్రి హస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. 

తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పీఎస్‌కు చెందిన భవానీ.. 2018లో పోలీసు ఉద్యోగంలో చేరింది. రాజోల్‌లో పోలీస్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసుకుంది. ఆ తర్వాత సఖినేటిపల్లిలో పీఎస్‌లో మొదటి పోస్టింగ్‌లో చేరింది. భవానీ స్వస్థలం కృష్ణాజిల్లా కోడూరు మండంల పాలెం గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: శ్మశానంలో ‘డాక్టర్‌’ చదువు

Advertisement
 
Advertisement
Advertisement