Online Classes Medical Student At Cemetery: శ్మశానంలో ‘డాక్టర్‌’ చదువు

Medical Student Listening Online Classes Cemetry Choppadandi Karimnagar  - Sakshi

సిగ్నల్స్‌ అందక.. మరోదారి లేక.. 

సమాధుల మధ్య ఆన్‌లైన్‌ తరగతులు 

మల్యాల(చొప్పదండి): ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకులగది శ్మశానంలోనిది.. అందులోనే ఆన్‌లైన్‌క్లాసులు వింటోంది ఓ వైద్య విద్యార్థి.. ఎందుకంటే.. ఇంట్లో ఉంటే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కరువు. మేడ మీదికి వెళ్తే కోతుల బెడద. అందుకే సిగ్నల్స్‌ సరిపడా ఉన్న శ్మశానవాటికనే ఆన్‌లైన్‌ క్లాసులకు వేదికగా చేసుకుంది జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన. ఆమె ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించి 2017లో ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో చేరింది.

కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. ‘మా ఊర్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సమస్య తీవ్రంగా ఉంది. గతేడాది కూడా కుటుంబసభ్యుల సహకారంతో నిత్యం శ్మశానవాటికలోనే ఆన్‌లైన్‌ పాఠాలు విన్నాను. నాలాంటి వారికోసం సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’అని కల్పన కోరుతోంది. 

చదవండి: మీ ఇష్టం.. గణేష్‌ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top