మీ ఇష్టం.. గణేష్‌ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్‌

Hyderabad: NoHeight Restrictions For Installation Of Ganesh Idols - Sakshi

ఎత్తు మీ ఇష్టం

ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం

సెప్టెంబర్‌ 19న హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం

ఏర్పాట్లపై సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, బంజారాహిల్స్‌: ఈ ఏడాది గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. వచ్చే నెల 10వ తేదీనుంచి ప్రారంభం కానున్న గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి తలసాని అధ్యక్షతన గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సీహెచ్‌.మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌రవీంద్ర, రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్, భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవరెడ్డి, భగవంతరావు, ఖైరతాబాద్‌ బాలాపూర్‌ సికింద్రాబాద్‌ ప్రాంతాలకు చెందిన గణేష్‌  మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ. .సెప్టెంబర్‌10న విగ్రహ ప్రతిష్టతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 19న శోభాయాత్రతో నిమజ్జన కార్యక్రమం ముగుస్తుందన్నారు. 
చదవండి: ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్‌ మాదిరే ఇక్కడ కూడా 

ఎలాంటి ఆంక్షలు లేవు... 
►విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని, నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లోని అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రతినిధులకు స్పష్టత నిచ్చారు.  
►ఈ విషయంలో పోలీసులనుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. 
►పోలీస్‌ అధికారులు కూడా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనిచేసేలా ఆదేశాలివ్వాలని డీజీపీకి మంత్రి సూచించారు. 
►ప్రసిద్ధి గాంచిన బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ధ్వంసం అయ్యాయని ఉత్సవకమిటీ నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్ని సోమవారం సందర్శించి మరమ్మతు పనులు చేపట్టాలని అక్కడే ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించారు. 
►ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నిమజ్జనానికి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసులు సహకరించాలని, క్రేన్‌ను ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌ విజ్ఞప్తి చేశారు.  
►అత్యధిక విగ్రహాలను నిమజ్జనం చేసే హుస్సేన్‌ సాగర్, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మీరాలం చెరువుల్లో పూడిక తొలగింపు పనులను చేపట్టాలని నిర్వాహకులు కోరగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ను ఆదేశించారు.  
►దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీబీ ఆధ్వర్యంంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మల్లేశం, వాణీదేవి, దయానంద్‌ గుప్తా, కాటేపల్లి జనార్దన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటే‹Ù, హోంశాఖ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి రవిగుప్తా, మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్‌కుమార్, ఆర్‌అండ్‌బీ కార్యదర్శి సునీల్‌«శర్మ, ఈఎన్‌సీ గణపతి రెడ్డి,  హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్, రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top