యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్‌ స్తంభానికి కట్టేసి..

Woman And Young Man Were Detained Due To Illicit Affair In Karnataka - Sakshi

మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం ఆరోపణతో ఓ వివాహితతో పాటు యువకుడిని కరెంట్‌ స్తంభానికి కట్టేసి మూడు రోజుల పాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనలో బాధితురాలి భర్తను పోలీసులు అరెస్ట్‌ చేయగా ఆమె మరిది పరారయ్యాడు. కౌలంద పోలీసుల వివరాల మేరకు... నంజనగూడు తాలూకాకు చెందిన వివాహితకు కూలి పనులకు వెళ్తున్న సమయంలో విష్ణు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

చదవండి: డబ్బు సంపాదించాలని.. ఆ నీలి చిత్రాలను ఉపయోగించుకుని..

మూడు రోజుల క్రితం విష్ణు యథావిధిగా వివాహిత ఇంటికి వచ్చాడు. అతను ఇంటిలోకి వెళ్లగానే బయటి నుంచి భర్త తలుపులు బిగించి గ్రామస్తులను పిలిచి వారిని బయటకు తీసుకువచ్చి కరెంట్‌ స్తంభానికి కట్టేశారు. మూడు రోజుల పాటు ఆహారం, నీరు ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశాడు. కొందరు యువకులు ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. పోలీసులు వచ్చి      స్పృహ తప్పిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top