పెళ్లై ఏడు నెలలు.. భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు | wife murder by husband | Sakshi
Sakshi News home page

పెళ్లై ఏడు నెలలు.. భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు

Apr 13 2023 11:54 AM | Updated on Apr 13 2023 12:12 PM

 wife murder by husband  - Sakshi

మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త ఉదంతం దొడ్డ పట్టణ పరిధిలోని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన జనిలా జోబియా(23)కు శ్యామ్‌(26)తో ఏడు నెలల క్రితం వివాహమైంది. శ్యామ్‌ స్థానిక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శ్రీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఓ దశలో శ్యామ్‌ కత్తితో జనిలాను శరీరమంతా విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డు వచ్చిన శ్యామ్‌ తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ జనిలాను శ్యామ్‌ స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు  పట్టణ పోలీసులు తెలిపారు.శ్యామ్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement