పక్కా ప్లాన్‌తోనే వరలక్ష్మిని హత్య చేశాడు..

Visakha Commissioner Says Its A Pre Planned Murder Of Gajuvaka Girl - Sakshi

సాక్షి, విశాఖపట్నం : గాజువాకలోని శ్రీనగర్‌ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి ప్రేమోన్మాదానికి ఇంటర్‌ విద్యార్థిని వరలక్ష్మి బలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తాజాగా వరలక్ష్మిని పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా భావిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్ కుమార్‌ సిన్హా తెలిపారు. ఆదివారం గాజువాక శ్రీనగర్‌లోని వరలక్ష్మి ఇంటికి స్వయంగా వెళ్లిన సీపీ కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు.  (చదవండి : గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం)

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'వరలక్ష్మి హత్య పక్కా ప్రణాళికతో జరిగింది. హత్య చాలా బాధాకరమైన సంఘటన. నిందితుడు తండ్రి ఇచ్చిన సమాచారంతో సంఘటన ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అయితే అప్పటికే చాలా రక్తం పోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే వరలక్ష్మి మృతి చెందింది. కాగా ఈ హత్య కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేశాం. ఈ కేసును దిశా ఏసీపీకి అప్పగించాం. వారం రోజుల్లో చార్జీ షీట్ వేస్తాం. (చదవండి : వరలక్ష్మి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు)


విశాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా

'సంఘటనా ప్రాంతంలో ఎలాంటి క్లూస్ లభించకూడదని తారుమారు చేయాలననే ప్రయత్నం చేశారు. వరలక్ష్మి హత్యకు ముందే అఖిల్‌ ఒక రౌడీ షీటర్‌ను సంప్రదించినట్లు తెలిసింది. నిందితుడు చాలా పక్కా ప్లాన్ తో మర్డర్ చేశాడు. ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం కత్తి, కారం తీసుకుని వరలక్ష్మిని హత్య చేయడానికి సిద్ధం అయ్యాడు. ఆ తర్వాత ఇదంతా  వేరే వాళ్ళు చేసినట్లుగా చూపించేందుకు యత్నించాడు.అయితే నిందితుడు తండ్రి నుంచి పోలీసులకు సమాచారం మొదటగా రావడంతో వరలక్ష్మి హత్య కేసులో అఖిల్‌ తండ్రి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నాం. కాగా 6.42 సమయంలో హత్య జరిగినట్లు అఖిల్‌ తండ్రి ఫోన్‌లో చెప్పారని.. కాగా అఖిల్‌ తండ్రిపై గతంలో రౌడీషీట్ ఉందని తేలింది. పక్క ప్లాన్‌తోనే ప్యూర్ క్రిమినల్ మర్డర్ చేశారు. .చట్ట ప్రకారం  అన్ని కఠిన చర్యలు తీసుకుంటామని' కమిషనర్‌ మనీష్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top