వరలక్ష్మి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

New Twist Gajuwaka Girl Assassination Case - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పథకం ప్రకారమే వరలక్ష్మి హత్య జరిగింది. యువతి హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణమని తేలింది. వరలక్ష్మిపైన అనుమానంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  (మరదలితో రెండో పెళ్లి.. నిప్పంటించిన మొదటి భార్య)

కాగా.. సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటంతో భరించలేక పథకం ప్రకారం హత్య చేసినట్టు వెల్లడైంది. మరో వైపు ఊహించని ఈ పరిణామంతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్‌ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి కోరుకుంటోంది. తాజా ఘటనపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబానికి ఎదురు కారాదని స్థానికులు బాధిత యువతి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.  (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం)

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సుచరిత
గుంటూరు: విశాఖపట్నం​ ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్రంగా మండిపడ్డారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే అంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నాతాధికారులతో మాట్లాడి​ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న హోంమంత్రి.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  (గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్) 

శాంతి ర్యాలీకి మహిళా కమిషన్‌ పిలుపు
ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని వరలక్ష్మికి నివాళి అర్పిస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం బీచ్‌ రోడ్‌లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి మహిళా కమిషన్‌ పిలుపునిచ్చింది. వరలక్ష్మికి మద్దతుగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top