Police Station Attacks By Mob To Frees Dacoit Madhya Pradesh - Sakshi
Sakshi News home page

‘సింగం 2' సీన్‌ రిపీట్‌.. 50 మంది ఒకేసారి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి..

Apr 8 2023 8:40 PM | Updated on Apr 9 2023 5:18 AM

Video: Police Station Attacks By Mob To Frees Dacoit Madhya Pradesh - Sakshi

కొన్ని సినిమాలు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతాయి. ఈ విషయం అందరికీ తెలసిందే. ఈ తరహాలోనే రియల్‌ లైఫ్‌లో జరగుతున్న కొన్ని ఘటనలు కూడా సినిమాలోని సన్నివేశాలను పోలి ఉంటున్నాయి. తాజాగా సూర్య నటించిన ‘సింగం2’ సినిమాలోని సన్నివేశం తరహాలో జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.  ఓ గుంపు పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించి పోలీసులపై దాడి చేసి ఖైదీలను విడిపించి తీసుకెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బుర్హాన్‌పూర్‌లోని నేపానగర్‌ పోలీసు స్టేషన్‌లో నలుగురు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.  హఠాత్తుగా  50 మందికి పైగా ఉన్న గుంపు స్టేషన్‌లోకి ప్రవేశించి విధుల్లో ఉన్న పోలీసులపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఓ వైపు పోలీసులపై దాడి చేస్తూ మరో వైపు లాకప్‌లో నిందితుడిగా ఉన్న హేమా మేగ్వాల్‌తో పాటు మరో ఇద్దరిని జైలు నుంచి విడిపించి తీసుకెళ్లారు.

ఇదంతా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దాడి జరిగిన సమయంలో నలుగురు సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడగా ప్రస్తుతం వారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement