విజయవాడ: టూరిస్ట్‌ గైడ్‌ నందా విష్ణువర్ధన్‌పై దాడి | Tourist Guide Nanda Vishnuvardhan Attacked In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ: టూరిస్ట్‌ గైడ్‌ నందా విష్ణువర్ధన్‌పై దాడి

Aug 11 2023 11:49 AM | Updated on Aug 11 2023 12:30 PM

Tourist Guide Nanda Vishnuvardhan Attacked In Vijayawada - Sakshi

నందా విష్ణువర్ధన్‌ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: టూరిస్ట్‌ గైడ్‌ నందా విష్ణువర్ధన్‌పై దాడి జరిగింది. నలుగురు వ్యక్తులు బందర్‌రోడ్డులోని ఆఫీసులో విష్ణును రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌లోని ఫర్నీచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. 

ఇక, దుండగుల దాడిలో విష్ణు తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని మాచవరం సీఐ గునరామ్‌ పరిశీలించారు. అయితే, దాడి సందర్భంగా అదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండగా నిందితులు జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉండగా.. ఆలిండియా హాస్టల్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీగా విష్ణు ఉన్నాడు. ట్రెక్కింగ్‌ గైడ్‌, టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తున్నాడు. ఇక, మహిళల వ్యవహారం కారణంగానే విష్ణుపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: రాజకీయాల్లో యాక్టివ్‌.. బీజేపీ నేత దారుణ హత్య..

Advertisement
 
Advertisement
Advertisement