కొట్లాటలో ముగ్గురికి గాయాలు | Three Were Injured In Battle At Parvathipuram Manyam | Sakshi
Sakshi News home page

కొట్లాటలో ముగ్గురికి గాయాలు

May 1 2022 1:38 PM | Updated on May 1 2022 1:38 PM

Three Were Injured In Battle At Parvathipuram Manyam   - Sakshi

పార్వతీపురం టౌన్‌: కొట్లాటలో ముగ్గురికి గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన కర్రి అన్నపూర్ణమ్మ తన ఖాళీ స్థలంలో బోరు తీయడానికి ప్రయత్నించగా, ఆమె సోదరుడు ముదిలి కన్నంనాయుడు, అతని భార్య సంతోషి, కుమారుడు రామారావు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కొట్లాటకు దారి తీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన అన్నపూర్ణమ్మ, కృష్ణమూర్తి, సంతోషి గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా నారాయణపట్నం బ్లాక్‌ రాయివలస గ్రామానికి చెందిన తాడంగి లచ్చయ్య గేదెగొమ్మి గ్రామం నుంచి తన గ్రామానికి మోటార్‌ సైకిల్‌పై వస్తుండగా.. పార్వతీపురం మండలం అడారు గ్రామం దాటిన తర్వాత చెరువు మలుపు వద్ద  అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

(చదవండి: వెయ్యి సారా ప్యాకెట్లు స్వాధీనం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement