విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు.. | Three people In A Family Commits Suicide In Asifabad | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Nov 13 2020 1:54 PM | Updated on Nov 13 2020 1:59 PM

Three people In A Family Commits Suicide In Asifabad - Sakshi

సాక్షి, కొమురం భీమ్‌ : ఆసీఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బూరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్య భర్తల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా నక్క రాజు అనే వ్యక్తి భార్య తన కూతురిని వెంట తీసుకొని మహారాష్ట్ర లోని వారి పుట్టింటికి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం కూతురితో కలిసి తల్లి ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త నక్క రాజు తన ఇంటి దగ్గర ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని సమాచారం. చదవండి: సైబర్ టవర్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం

చదవండి: జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement