విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి | Three Dead In Train Accident At Medchal Gowdavelli | Sakshi
Sakshi News home page

విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి

Aug 11 2024 6:02 PM | Updated on Aug 11 2024 7:15 PM

Three Dead In Train Accident At Medchal Gowdavelli

సాక్షి, మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొన్న ఘటనలో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. ఈ ఘటన గౌడవెల్లి రైల్వేస్టేషన్‌ వద్ద జరిగింది.

వివరాల ప్రకారం.. రైల్వే లైన్‌మెన్‌గా పనిచేస్తున్న కృష్ణ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ట్రాక్‌ వద్ద పనులు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తన కుమార్తెలను ట్రాక్‌పై కూర్చోబెట్టి కృష్ణ పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో సడెన్‌గా రైలు రావడంతో ట్రాక్‌పై ఉన్న తన పిల్లలను కాపాడేందుకు కృష్ణ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిని కాపాడబోయి రైలు తగిలి ముగ్గరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, మృతులను రాఘవేంద్రనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత, వరిణిగా స్థానికులు చెప్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement