అమ్మను కొడుతుండు.. కాపాడండి | Three Children Police Complaint Against Father In Rangareddy District | Sakshi
Sakshi News home page

అమ్మను కొడుతుండు.. కాపాడండి

Jun 7 2022 1:54 AM | Updated on Jun 7 2022 1:54 AM

Three Children Police Complaint Against Father In Rangareddy District - Sakshi

ఆదిభట్ల  పోలీసు స్టేషన్‌కు వచ్చిన చిన్నారులు 

ఇబ్రహీంపట్నం రూరల్‌: ‘సార్‌ మా నాన్న తాగొచ్చి అమ్మను ఇష్టమొచ్చినట్టు కొడుతుండు. జర మీరే కాపాడాలి’ అంటూ ముగ్గురు చిన్నారులు పోలీసులను వేడుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ నరేందర్‌ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన పంతంగి రాజీవ్, పద్మ ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు దీపు (10), శివరామకృ ష్ణ (7), లక్ష్మీకాంత్‌ (6) సంతానం. ఆదిభబట్ల టీసీఎస్‌ కాలనీలో ఉంటున్నారు. రాజీవ్‌ నిత్యం తాగొచ్చి పద్మను వేధించే వాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. అడ్డొచ్చిన వృద్ధులైన పద్మ తల్లిదండ్రులపైనా చేయిచేసుకున్నాడు. దీంతో ముగ్గురు పిల్లలు ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తండ్రిపై ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ.. పోలీసులను ఇంటికి పంపారు. నిందితుడు రాజీవ్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. మద్యం సేవించి ఉండటంతో రాజీవ్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement