రూ. 1.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం | Telangana Police Seized Cannabis Worth Rs. 1.25 Crore | Sakshi
Sakshi News home page

రూ. 1.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

Sep 28 2021 2:51 AM | Updated on Sep 28 2021 2:51 AM

Telangana Police Seized Cannabis Worth Rs. 1.25 Crore - Sakshi

స్వాధీనం చేసుకున్న గంజాయి  

చుంచుపల్లి: ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి పుణేకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్‌చేశారు. వారి నుంచి రూ. 1.25కోట్ల 626 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చుంచుపల్లి సీఐ గురుస్వామి చెప్పారు. మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లాకు చెందిన శ్యాం శివాజీ ఖలే, ప్రభాకర్‌ తంబే, అరవింద్‌ గులేతో పాటు కున్లు ఒడిశా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశారు.

ఈ గంజాయిని 26 బస్తాల్లో పేర్చి లారీలో కొబ్బరి మొక్కల మధ్యలో పెట్టి భద్రాచలం, కొత్తగూడెం మీదుగా తరలిస్తుండగా చుంచుపల్లి విద్యానగర్‌ కాలనీ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్సై మహేష్‌ పట్టుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పట్టుబడగా, కున్లు పరారయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement