Road Accident in Adilabad: Man Dies at Road Accident on His Marriage Day - Sakshi
Sakshi News home page

అయ్యో భగవంతుడా! పెళ్లిరోజే.. చివరిరోజు

May 31 2022 5:26 PM | Updated on May 31 2022 6:20 PM

Telangana: Man Dies At Road Accident On His Marriage Day - Sakshi

సాక్షి,జైనథ్‌(ఆదిలాబాద్‌): మండలంలోని కామాయి ఎక్స్‌ రోడ్‌ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాండగాడకు చెందిన టక్కూరి ఉమేష్‌ మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన టక్కూరి ఉమేష్‌(28) మ్యారేజ్‌డే సందర్భంగా ఉదయం తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌ వెళ్లి వచ్చాడు.

బైక్‌లో పెట్రోల్‌ పోసుకునేందుకు కామాయి ఎక్స్‌రోడ్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌కు వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుని తండ్రి అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పెర్సిస్‌ బిట్ల తెలిపారు.

చదవండి: దారుణం.. భర్త నిద్రపోతుంటే.. రాత్రి ప్రియుడితో కలిసి కారులో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement