వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దేవినేని ఉమా అనుచరుల దాడి

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ ప్రసాద్‌పై దాడికి టీడీపీ నేతలు యత్నించారు.
అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
మరిన్ని వార్తలు :