
తేజావత్ శ్వేత
డోర్నకల్: చదువులో రాణించలేకపోతున్నానని మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. బొడ్రాయితండాకు చెందిన తేజావత్ శ్వేత(19) ఖమ్మంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్‌లో ఫెయిలవడం, ఇటీవల జరిగిన ఎస్‌ఐ అర్హత పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఆవేదన చెందింది.
చివరకు 16వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. దీంతో శ్వేతను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.