శ్రావణి కేసులో కస్టడీకి దేవరాజ్‌, సాయికృష్ణ | Sravani Case: Devaraj, Saikrisha sent to police custody for 3 days | Sakshi
Sakshi News home page

శ్రావణి కేసులో కస్టడీకి దేవరాజ్‌, సాయికృష్ణ

Sep 26 2020 10:25 AM | Updated on Sep 26 2020 10:33 AM

Sravani Case: Devaraj, Saikrisha sent to police custody for 3 days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అరెస్టయి చంచలగూడ జైలులో ఉన్న ఇద్దరు నిందితులు సాయి కృష్ణ, దేవరాజ్ రెడ్డిని ఎస్సార్‌ నగర్‌ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్‌మెయిల్‌ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. 

న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న దేవరాజ్‌, సాయిలను తిరిగి పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించి శ్రావణి ఆత్మహత్యకు గల మరిన్ని కారణాలు తెలుసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు.  అయితే ఈ కేసులో మూడో నిందితుడు అయిన అశోక్‌ రెడ్డిని మాత్రం పోలీసులు ఇంకా కస్టడీకి తీసుకోలేదు.


 

Advertisement
 
Advertisement
Advertisement