కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్‌ చేసి మరీ...

Son Stabbing His Parents To Death In Maharashtra - Sakshi

నేటి యువత ప్రస్తుత టెక్నాలజీ మాయలో పడి తల్లిదండ్రుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం తల్లిదండ్రులుగా వారికి మందలించే హక్కు కూడా లేదనే చెప్పాలి. ఆస్తి కోసమో లేక వారికి నచ్చింది చేయడం లేదనో కన్న తల్లిదండ్రుల పైనే కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. మరికొంతమంది ప్రబుద్ధులైతే తల్లిదండ్రులనే కడతేర్చేందుకు రెడీ అయిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడోక దుర్మార్గుడు కన్నతల్లిదండ్రులను చంపి, సోదరికి ఫోన్‌ చేసి మరీ చెప్పాడు.

వివరాల్లోకెళ్తే.... మహారాష్ట్రలోని థానే జిల్లాలోని టిట్వాలా ప్రాంతంలో 37 ఏళ్ల అన్మోల్ భోంస్లే తన కన్న తల్లిదండ్రలనే కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన సోదరికి ఫోన్‌ చేసి మరీ విషయం చెప్పాడు. దీంతో అతని సోదరి హుటాహటినా ఇంటికి వచ్చి చూడగా...తల్లిదండ్రులిద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఇల్లంతా దుర్వాసన రావడమే కాకుండా అన్మోల్‌ కూడా ఆ మృతదేహాల పక్కనే కూర్చొని ఉన్నాడు.

ఈ మేరకు ఆమె అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో దంపతులను కత్తితో పొడిచి చంపినట్లు తెలిసింని పోలీసులు చెప్పారు. మృతులు  అశోక్ భోంస్లే (55), ఆయన భార్య విజయ భోంస్లే (50)గా గుర్తించామని తెలిపారు.

(చదవండి: అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top