మొదటి భర్త హత్యకు రెండో భర్త ప్లాన్‌ | Second husband Plan to kill First Husband in Yeswanthpur | Sakshi
Sakshi News home page

మొదటి భర్త హత్యకు రెండో భర్త ప్లాన్‌

Aug 31 2022 12:14 PM | Updated on Aug 31 2022 12:17 PM

Second husband Plan to kill First Husband in Yeswanthpur - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు(యశవంతపుర): భార్య మొదటి భర్తను రెండో భర్త కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుండగా కారు పంచరై ప్లాన్‌ బెడిసింది. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరులో జరిగింది. రాజస్థాన్‌కి చెందిన మంజుల, మోహన్‌రామ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కడూరుకు తీసుకొచ్చి చిన్న వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. రెండు నెలల క్రితం రాజస్థాన్‌కు వెళ్లిన భార్య మంజులను మోహన్‌ రామ్‌ తీసుకురావడానికి వెళ్లగా ఆమె రాలేదు.

హర్యానాకు చెందిన ఓం ప్రకాశ్‌ను మంజుల పెళ్లి చేసుకుని బెంగళూరులో కాపురం పెట్టింది. మరోవైపు ఇదేమీ తెలియని మోహన్‌రామ్‌ భార్యకు పదేపదే వాట్సప్‌ మెసేజ్‌లు పంపి తన వద్దకు వచ్చేయాలని కోరేవాడు. దీంతో రెండో భర్త ఓం ప్రకాశ్‌ అతన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.

ఈ నెల 28న  రాత్రి బెంగళూరు నుంచి అనుచరులతో కడూరుకు వెళ్లి మోహన్‌రామ్‌ను మాట్లాడాలని ఊరిబయటకు తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి కారులో తీసుకెళ్లాడు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంబడించగా, నిందితుల కారు కడూరు తాలూకా మతిఘట్ట వద్ద కారు పంచరైంది. వెంటనే పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.    

చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్‌ విద్యార్థితో జంప్‌)

Advertisement
 
Advertisement
Advertisement