గ్యాంగ్‌ నుంచి వెళ్లిపోయాడని..కిడ్నాప్‌ చేసి బట్టలూడదీసి...

Rowdy Gang Who Stripped And Attacked Young Man At Rajendranagar - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: గ్యాంగ్‌ నుంచి వెళ్లిపోయి తమపైనే దుష్ప్రచారం చేస్తావా అంటూ ఓ రౌడీషీటర్‌ తన అనుచరులతో కలిసి ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి బట్టలూడదీసి చితకబాదిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. గతంలో రెండు సార్లు సదరు యువకుడిపై ఇదే గ్యాంగ్‌ దాడికి పాల్పడింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో వారు మరోసారి తెగబడ్డారు. రౌడీషీటర్‌తో పాటు అతడి అనుచరులు యువకుడిని కొడుతున్న దృశ్యాలను వీడియో తీసి తమ సెల్‌ఫోన్‌ స్టేటస్‌లలో పోస్టు చేసుకోవడం గమనార్హం.

తమతో ఎవరైనా పెట్టుకుంటే తమను కాదంటే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజేంద్రనగర్‌ పోలీసులు, బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సన్‌సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను గతంలో రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ రౌడీïÙటర్‌ ఇర్ఫాన్‌తో సన్నిహితంగా ఉండే వాడు. అతడి గ్యాంగ్‌లో తిరుగుతూ గొడవలు పడేవాడు. దీంతో తల్లిదండ్రులు మహ్మద్‌ ఇర్ఫాన్‌ను మందలించి ట్యాక్సీ  కోనుగోలు చేసి ఇచ్చారు. గత 8 నెలలుగా ట్యాక్సీ నడుపుకుంటున్న ఇర్ఫాన్‌ ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో రౌడీషీటర్‌ ఇర్ఫాన్‌ తన గ్యాంగ్‌ నుంచి వెళ్లిపోయినందుకు రూ.50 వేలు ఇవ్వాలని అతడికి ఫోన్‌చేసి బెదిరిస్తున్నాడు. రెండు సార్లు ఇంటి వద్దకు వచ్చి గొడవపడి దాడి చేశాడు.

రెండు నెలల క్రితం అతడిపై దాడి చేయడంతో బాధితుడి సోదరుడు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి మహ్మద్‌ ఇమ్రాన్‌ తన కారును లంగర్‌హౌజ్‌లో సరీ్వసింగ్‌కు ఇచ్చి ఇంటికి వచ్చేందుకు వేచి ఉన్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రౌడీషీటర్‌ ఇర్ఫాన్‌ అతడి స్నేహితులు జహీర్, షహీన్‌షా, ముదస్సర్, ఫవాద్‌లు మహ్మద్‌ ఇర్ఫాన్‌ను మాట్లాడేది ఉందంటూ ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని కిస్మత్‌పూర్‌ దర్గా సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే అతడి దుస్తులు విప్పించి బెల్టులు, కర్రలతో చితకబాదారు. ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు మహ్మద్‌ ఇర్ఫాన్‌పై దాడి చేసి అనంతరం సన్‌సిటిలోని ఇంటి వద్ద వదిలి వెళ్లారు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. రౌడీషీటర్‌ గ్యాంగ్‌ రికార్డు చేసిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌ స్టేటస్‌లతో పాటు గ్రూప్‌లలో పోస్టులు చేశారు. తమతో విభేదించినా, తమతో పెట్టుకున్న వారికి ఇదే గతి పడుతుందని కామెంట్‌ చేశారు. ఈ క్లిప్పింగ్‌ చూసిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ సోదరుడి స్నేహితుడు సమాచారం అందించడంతో అతను మహ్మద్‌ ఇర్ఫాన్‌ను నిలదీశాడు. అప్పటికే గాయాలతో బాధపడుతున్న మహ్మద్‌ ఇర్ఫాన్‌ను రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసి ఉషామోహన్‌ ఆసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

పోలీసులు స్పందించి ఉంటే... 
గతంలో మహ్మద్‌ ఇర్ఫాన్‌పై రౌడీషీటర్‌ ఇర్ఫాన్‌ గ్యాంగ్‌ దాడి చేసి బెదిరించింది. ఈ విషయాన్ని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితుడి సోదరుడు ఆరోపించారు. అప్పుడే స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదన్నాడు. ఇప్పటికైనా రౌడీïÙటర్‌ ఇర్ఫాన్‌తో పాటు అతడి గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.   

(చదవండి: మానవత్వం మరుస్తున్నామా...నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..కానీ ఒక్కరూ...)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top