గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Road Accident Take Place At Madhya Prdesh Gwalior - Sakshi

ఫంక్షన్‌కు వెళ్తున్న వర్కర్‌ల ఆటోని ఢీ కొట్టిన బస్సు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో సుమారు 10 మంది మృతి చెందారు. గ్వాలియర్‌ పూరాణి చవానీ ప్రాంతంలో ఈ ప్రమాదంలో చోటు చేసుకుంది. వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో, బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 10 మంది మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి ఆటో నుజ్జు నుజ్జు అయ్యి ఐరన్‌ ముద్దలా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిటీ ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘ఆటో రిక్షా ఓవర్‌లోడ్‌తో వెళ్తోంది. ఆటోలో సుమారు 13 మంది మహిళలే ఉన్నారు. వీరంతా ఓ ఫంక్షన్‌లో వంట చేయడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మొరేనా నుంచి స్పీడ్‌గా వస్తోన్న బస్‌ ఆటోని ఢీకొట్టింది. దాంతో ప్రమాదం చోటు చేసుకుంది’’ అని తెలిపారు.

చదవండి: తలపై నుంచి దూసుకెళ్లిన బస్సు చక్రం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top