Four Labourers Died In Road Accident At Gudluru Nellore District - Sakshi
Sakshi News home page

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి

Dec 20 2022 4:20 PM | Updated on Dec 20 2022 4:44 PM

Road Accident At Gudluru Nellore District Four Labourers Died - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారి పనుల్లో  నిమగ్నమైన  కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనా స్థలిలోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందగా మృతుల సంఖ్య అయిదుకి చేరింది. మిగతా వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు అసుపత్రికి తరలించారు.

ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌ రావు ప్రమాదాన్ని గమనించి ఆగిపోయారు. ప్రమాదంపై చలించిపోయిన ఎంపీ క్షతగాత్రులను తరలించే చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ జోన్‌గా ఉన్న మోచెర్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని భరోసానిచ్చారు.
చదవండి: సిరిసిల్ల యువతి కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement