Reactor Blast At Nalgonda: నల్గొండలో భారీ అగ్నిప్రమాదం.. పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో..

సాక్షి నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్ధం రావడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. ఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొస్తుంది.
చదవండి: Dellhi Liquor Scam: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..