మంత్రి కొడుకుపై అత్యాచారం కేసు.. మత్తు మందు ఇచ్చి.. నగ్నంగా ఫొటోలు తీసి

Rajasthan Minister Son Booked In Molestation Case - Sakshi

న్యూఢిల్లీ: రాజస్తాన్‌ రాష్ట్ర మంత్రి కుమారుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ జైపూర్‌ మహిళ(23) చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారోగ్య శాఖ మంత్రి మహేశ్‌ జోషి కొడుకు రోహిత్‌ బాధితురాలికి ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. పెళ్లి పేరుతో గత ఏడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 17వ తేదీ వరకు పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
చదవండి: దంపతుల హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు 

‘మొదటిసారి అతడు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదిరించాడు’అని పేర్కొంది. గర్భవతినని తెలిసి, అబార్షన్‌ చేయించేందుకు కూడా ప్రయత్నించాడని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సమాచారాన్ని రాజస్తాన్‌ పోలీసులకు పంపి, దర్యాప్తు చేపట్టామన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top