వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెచ్చి..

Prostitution Racket Busted Three Arrested Karnataka - Sakshi

యశవంతపుర(కర్ణాటక): పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల నుంచి అమ్మాయిలను బెంగళూరుకు తెచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్యాటరాయనపురకు చెందిన మధు (43), అసోంవాసి రఫికుల్‌ ఇస్లాం (21), పశ్చిమ బెంగాల్‌వాసి రుబేల్‌ మండల్‌ నిందితులు. దొడ్డబొమ్మసంద్ర కృష్ణ టెంపుల్‌రోడ్డులో ఈ దందా చేసేవారని తేలింది. (చదవండి: బార్‌లో అశ్లీల నృత్యాలు.. 64 మంది అమ్మాయిలతో.. )

మరో ఘటనలో..
కుటుంబ కలహాలతో ఆత్మహత్య 
హోసూరు: హోసూరు సమీపంలోని జొనబండ గ్రామానికి చెందిన వెంకటేష్‌ (33) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి తాగుడు అలవాటుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. బుధవారం ఏర్పడిన గొడవల్లో విరక్తి చెందిన వెంకటేష్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top