ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రణీత్ రావు చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Prosecution In Former Sib Dsp Praneeth Rao Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రాసిక్యూషన్‌కు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ పేరుతో పవర్ మిస్ యూజ్ చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రణీత్‌ రావును డీజీపీ ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్‌ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌ రావుపై అధికారులు సీరియస్ అయ్యారు.

ప్రభుత్వం మారటంతో ట్యాపింగ్ రికార్డ్స్ ధ్వంసం చేసిన ప్రణీత్ రావు.. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశాడు. 42 హార్డ్ డిస్క్‌ల్లో డేటాను రిమూవ్ చేశారు. ఎస్ఐబీ ఆఫీస్‌లోని లాగర్ రూమ్‌లో ఉన్న లాప్‌టాప్‌, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు. ఫోన్ టాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎమ్ఈఐ నంబర్ల వివరాల సైతం ధ్వంసం చేశాడు. డేటా బేస్ లో ఉన్న మొత్తం డేటాను ప్రణిత్‌ రిమూవ్ చేశాడు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశాడనే దర్యాప్తు చేపట్టారు.

అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్‌ ట్యాప్‌ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్‌ రావుకు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఐబీని గతంలో లీడ్‌ చేసిన అధికారులే ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో..

మాజీ ఐపీఎస్‌, మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు బంధువే ఈ ప్రణీత్‌ రావు. ప్రణీత్‌ కెరీర్‌లో అడుగడుగునా ప్రభాకర్‌ రావు అండ ఉంది. ప్రభాకర్‌ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్‌ ప్రొబేషన్‌ క్లియరెన్స్‌ అయ్యింది. అలాగే.. ప్రభాకర్‌ రావు ఎస్‌ఐబీ చీఫ్‌ కాగానే.. ప్రణీత్‌కు ఎస్‌ఐబీలో పోస్టింగ్‌ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్‌ఐబీలో ఉన్న ఇతర ఇన్‌స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్‌ ఇప్పించారని ప్రభాకర్‌ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం.

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top