బుద్ది తెలుసుకొని ఉన్న ఉద్యోగం పీకేశారు.. మళ్లీ నగ్నఫొటోలు, వీడియోలు..

Private Teacher Obscene Messages Send to Minor Girl in Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ మైనర్‌ బాలికకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఎస్‌ హరినాథ్‌ వివరాల ప్రకారం.. జగిత్యాల్‌కు చెందిన రేగొండ వెంకట సాయి (31) ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. విద్యార్థినుల ఫోన్‌ నంబర్లను సేకరించి ప్రతి రోజూ వాళ్లతో చాటింగ్‌ చేసేవాడు. అతని అసభ్య ప్రవర్తన యాజమాన్యం దృష్టికి రావటంతో అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించారు.  

ఈ క్రమంలో వెంకట సాయి తన ఫోన్‌లో మొబైల్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని వర్చువల్‌ నంబర్లను తీసుకున్నాడు. వాట్సాప్‌ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తిగా మైనర్‌ బాలికకు మెసేజ్‌లు చేయడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా తనను ప్రేమిస్తున్నాని చెప్పడంతో అప్పటి నుంచి సదరు బాలిక రిప్‌లై ఇవ్వటం మానేసింది. దీంతో కక్ష గట్టిన వెంకటసాయి సదరు బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫొటోలు, వీడియోలను పంపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం వెంకటసాయిని అరెస్ట్‌ చేశారు.  

చదవం‍డి: (కీచక హెచ్‌ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top