Lockdown: 38 రోజులు.. రూ. 61 లక్షలు..

Police Impose Fine on Who Violate Lock down Rules In Rajanna Siricilla - Sakshi

సాక్షి, సిరిసిల్లక్రైం: కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. గత నెల 12 నుంచి ఈ నెల 19 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ లాక్‌డౌన్‌ కాలంలో నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై పోలీసులు కేసుల నమోదుతోపాటు జరిమానాలు విధించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జిల్లాలో రూ.61.03 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. ప్రతీ నిత్యం ఎస్పీ రాహుల్‌హెగ్డే లాక్‌డౌన్‌ అమలును పరిశీలించారు.

కాలినడకనా.. బైక్‌పై కాలనీల్లో !
లాక్‌డౌన్‌ అమలు చేసే క్రమంలో ఎస్పీ, డీఎస్పీ, సీఐలు కాలినడకన ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేసిన సందర్భాలు అనేకం. శివారుప్రాంతాలు, కాలనీల్లో కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడం లేదని బైక్‌లపై పోలీసులు గస్తీ చేపట్టారు. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలీసుల ప్రత్యేక ఐసోలేషన్‌ వ్యాన్‌ విధానం ఉల్లంఘనుల్లో భయాన్ని కల్పించింది. 

రూ.61.03 లక్షల జరిమానా 
జిల్లాలో 38 రోజులపాటు కొనసాగిన లాక్‌డౌన్‌లో నిబంధనలు అతిక్రమించినందుకు వాహనదారులపై పోలీసులు రూ.61.03 లక్షల జరిమానా విధించినట్లు గణాంకాలున్నాయి. జిల్లాలో 602 వాహనాలు, 80 దుకాణాలు సీజ్‌ చేశారు. 573 ఈ పెట్టి కేసులు నమోదు చేశారు. మాస్కు ధరించని 682 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్ల డించారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్టు ప్రకారం 5,431 కేసులు నమోదైనట్లు తెలిపారు.

మాస్క్, భౌతికదూరం తప్పనిసరి 
కరోనా నియంత్రణకు అందరూ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి. సామాజిక బాధ్యతగా లాక్‌డౌన్‌ నిబంధనలు అందరూ పాటించాలి. దీని ద్వారా సమాజానికి, వ్యక్తిగతంగా, కుటుంబాన్ని కరోనా బారిన పడకుండా చూసిన వారవుతారు.            
  – రాహుల్‌హెగ్డే, ఎస్పీ, సిరిసిల్ల 

చదవండి: 6 నుంచి 8 వారాల్లో థర్డ్‌ వేవ్‌..!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top