రిపోర్టర్ బ్యాగులో రూ.50 లక్షలు

సాక్షి, విజయవాడ : గరుడ బస్సులో శుక్రవారం పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో 50 లక్షల రూపాయల్ని పోలీసులు కనుగొన్నారు. సరైన పత్రాలు లేకుండా పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. సదరు ప్రయాణికుడ్ని విశాఖ పెందుర్తి మహాన్యూస్ రిపోర్టర్ సూర్యనారాయణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హవాలా మనీ అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
చదవండి : దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి