గంజాయికి బానిస: తల్లిదండ్రులనే చంపుతానని | Parents Complaint To Police Over Son Harassment In Pedakakani | Sakshi
Sakshi News home page

గంజాయికి బానిస: తల్లిదండ్రులనే చంపుతానని

Mar 25 2021 9:10 AM | Updated on Mar 25 2021 9:32 AM

Parents Complaint To Police Over Son Harassment In Pedakakani - Sakshi

పెదకాకాని: కన్నకొడుకే చంపుతానని బెదిరిస్తున్నాడని తనను కాపాడాలని పెదకాకాని పాతూరుకు చెందిన దంపతులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని గ్రామంలోని పాతూరు రెడ్డివారి బావి సమీపంలో మహ్మద్‌ రఫిపుల్లా, భార్య జమీలా నివశిస్తున్నారు. రఫిపుల్లా సెక్యూరిటీ గార్డుగా వెళుతూ జీవనం సాగిస్తున్నారు. 21 సంవత్సరాల వయస్సు  కలిగిన వారి కుమారుడు నకీబ్‌వుల్లా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. మద్యం, పొగ తాగడంతో పాటు గంజాయికి బానిసగా మారాడు.

గంజాయి మత్తులో ఇంటికి రావడం డబ్బులు ఇవ్వాలని గొడవ పడటం, ఇవ్వకపోతే తల్లిదండ్రులపై దాడి చేస్తున్నాడు. గంజాయి మత్తులో వికృతంగా ప్రవర్తిస్తున్న కుమారుడితో తమకు ప్రాణహాని ఉందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంజాయి వ్యాపారం చేయాలనుకుంటున్నానని, రూ. 30 వేలు ఇవ్వాలని తమ కుమారుడు మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు.  తమ కుమారుడిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
చదవండి: రూ. రెండు వేల కోసం ప్రాణం తీశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement