Nursing Student Kavya Commits Suicide In Khammam District - Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ విద్యార్థి కావ్య ఆత్మహత్య.. కారణం ఏంటి?

Jun 22 2023 7:56 AM | Updated on Jun 22 2023 9:51 AM

Nursing Student Kavya Committed Suicide In Khammam District - Sakshi

తెలంగాణలో మరో నర్సింగ్‌ విద్యార్థి కావ్య ఆత్మహత్య చేసుకుంది.

ఖమ్మంక్రైం: ఖమ్మంలో ఓ నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన కోడెం కృష్ణ – రమాదేవి రెండో కుమార్తె కావ్య(19) ఖమ్మంలోని పారా మెడికల్‌ కాలేజీలో నర్సింగ్‌ (ఏఎన్‌ఎం) చదువుతోంది. ఖమ్మం, బీకే బజార్‌లోని ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తూ స్నేహితురాలు సీతామహాలక్ష్మితో కలిసి అద్దె గదిలో ఉంటోంది. 

అయితే, మంగళవారం నైట్‌ డ్యూటీకి వెళ్లి వచ్చిన ఆమె బుధవారం ఉదయం నిద్రపోయింది. స్నేహితురాలు సీతామహాలక్ష్మి విధులకు వెళ్లింది. తరువాత కావ్య మరో స్నేహితురాలు తనుశ్రీ వచ్చి కాసేపు మాట్లాడి తిరిగి కిందకు వెళ్తుండగా పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందోనని తనుశ్రీ వెళ్లి చూడగా కావ్య ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో వచ్చి కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. తాను మాట్లాడినప్పుడు కావ్య నీరసంగా ఉందని తనుశ్రీ తెలిపింది. ఘటనకు ముందు కావ్య తనకు ఫోన్‌ చేసి జాగ్రత్తలు చెప్పిందని తల్లి రమాదేవి వెల్లడించింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంది. తల్లి ఫిర్యాదుతో ఖమ్మం వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య ఎపిసోడ్‌లో కీలక ట్విస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement