ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ | Non Bailable Warrant Against Asaduddin Owaisi | Sakshi
Sakshi News home page

అసదుద్దీన్‌ ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్

Jan 25 2021 5:48 PM | Updated on Jan 25 2021 8:34 PM

Non Bailable Warrant Against Asaduddin Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఒవైసీ  విచారణకు హాజరు కాకపోవడంతో స్పెషల్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో కాంగ్రెస్‌ షబ్బీర్‌ అలీ కారులో వెళ్తుండగా అడ్డగించిన కొందరు వ్యక్తులు.. కారులో ఉన్న షబ్బీర్‌ అలీపై దాడి చేశారు. ఘటనలో ప్రధాన నిందితుడిగా అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదేళ్లుగా ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: లైంగిక వేధింపులు: ఉరికి వేలాడిన మహిళా ఎస్సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement