లైంగిక వేధింపులు: మహిళా ఎస్సై ఆత్మహత్య

Woman SI Ends Life Due to Sexual Harassment In Uttar Pradesh - Sakshi

లక్నో: అమ్మాయిలకు వేధింపులు ఎదురైతే పోలీసుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళా ఎస్సైకే వేధింపులు ఎదురయ్యాయి. వాటిని నిలువరించలేక మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన ఎస్సై చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటు చేసుకుంది. బులంద్‌షహర్‌ ఎస్‌ఎస్‌పీ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన 30 ఏళ్ల అర్జూ పవార్‌.. అనూప్‌షహర్‌ కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌లో 2015 నుంచి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె షామ్లి జిల్లాలో ఒంటరిగా నివసిస్తోంది. (చదవండి: కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్‌ యువతి)

అయితే గత కొంత కాలంగా ఆమెకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దీంతో తీవ్రంగా కలత చెందిన సదరు మహిళ తను నివాసం ఉంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. మరోవైపు ఇంటి యజమాని ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఆమె స్పందించకపోవడంతో తలుపు తట్టి చూడగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి చూడగా ఆమె సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. గదిలో సూసైడ్‌ నోట్‌ కూడా లభ్యమైంది. అందులో తన చావుకు తనే కారణమని పేర్కొంది. (చదవండి: యూట్యూబ్ నటికి వేధింపులు..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top