నాందేడ్‌ లష్కరే తొయిబా కేసులో ఎన్‌ఐఏ కోర్టు తీర్పు

NIA Court In Mumbai Sentenced Three Lashkar-E-Taiba Terrorists Imprisonment - Sakshi

ముంబై: నాందేడ్‌ లష్కరే తొయిబా కేసులో ఎన్‌ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది.ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులకు జైలు శిక్షను ఎన్‌ఐఏ కోర్టు విధించింది. ముజామిల్‌, సాదిక్‌, అక్రంకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. 2012లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది.

హిందూ నేతలు , జర్నలిస్ట్ లు ,రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారు. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్ర పన్నారని ఎన్‌ఐఏ పేర్కొంది.వీరు హైదరాబాద్ కు  చెందిన  ఇండియన్ మోస్ట్ వాంటెడ్  సిద్ధికి బిన్ ఉస్మాన్, ఫుర్ఖాన్ భాయ్ ల తో అక్రమ్ సంబంధాలు కల్గి ఉన్నారు.

చదవండి: అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్‌ అరెస్టు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top