ముంబై: మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. హింగోలి జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. దీనితో పాటు నాందేడ్, పర్భణీ జిల్లాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.