నవ్యరెడ్డి హత్య: కీలక విషయాలు వెల్లడి | Navya Reddy Murdered Case SI Reveals Investigation In Khammam | Sakshi
Sakshi News home page

నవ్యరెడ్డి హత్య.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్‌ఐ

Feb 7 2021 11:14 AM | Updated on Feb 7 2021 8:36 PM

Navya Reddy Murdered Case SI Reveals Investigation In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: వివాహిత నవ్యరెడ్డి హత్య కేసులో ఎర్రుపాలెం ఎస్‌ఐ కీలక విషయాలను వెల్లడించారు. ప్రియురాలిపై మోజుతోనే భార్య నవ్యరెడ్డి ఆమె భర్త నాగశేషురెడ్డి హత్య చేశాడని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడు నాగ శేషురెడ్డి పెగళ్లపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. చదవండి: ఖమ్మం జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఘాతుకం

వివాహేతర సంబంధంపై భర్తను భార్య నవ్యరెడ్డి నిలదీయటంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఎలాగైనా భార్యను చంపి, ప్రియురాలితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నాగ శేషురెడ్డి ఈనెల 2న భార్య నవ్యను సత్తుపల్లి సమీపంలోని ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద దింపి వస్తానని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు.

ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు వేసి తాగించాడు. అనంతరం పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామ సమీపంలోని కుక్కలగుట్ట వద్దకు తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేశాడని ఎర్రుపాలెం ఎస్‌ఐ వివరించారు. నిందితుడిని మధిర కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. హత్య కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement