మతిస్థిమితం లేక.. తాగిన మైకంలో ఉరి వేసుకుని..  | Mubarakpur Mentally Ill Man Hanging In Drunken Stupor | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేక.. తాగిన మైకంలో ఉరి వేసుకుని.. 

Dec 6 2021 12:39 PM | Updated on Dec 6 2021 12:53 PM

Mubarakpur Mentally Ill Man Hanging In Drunken Stupor - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నవాబుపేట: తాగిన మైకంలో ఉరివేసుకొని ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ముబారక్‌ పూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం చిన్నారివెల్లికి చెందిన యాదిష్‌ వెంకటయ్య(40) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం భార్య యాదమ్మ, కూతుళ్లు సంతోష, సంధ్య, కుమారుడు శ్రీరామ్‌తో కలిసి నవాబుపేట మండలం ముబారక్‌ పూర్‌ గ్రామానికి వలస వచ్చి ఉంటున్నారు.

గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు  అతను కింద పడటంతో తలకు గాయమైంది. అప్పటి నుంచి  వెంకటయ్యకు మతిస్థిమితం సరిగ్గా పనిచేయడం లేదు. దానికి తోడు మద్యానికి  బానిస అయ్యాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో అర్ధరాత్రి వేళ పక్కన ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య  యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ ఐ వెంకటేశం తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement